బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు. కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు.

తేది:9-03-2026 హనుమకొండ TSLAWNEWS పశ్చిమ నియోజక వర్గం ఇంచార్జి దొమ్మటి పవన్ గౌడ్.

వరంగల్ జిల్లా: హన్మకొండ సుబేదారిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 45వ డివిజన్ పరిధిలోని తరాలపల్లి, కుమారిగూడెం గ్రామాలకు చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై రాగా వారికి వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం కోసం పనిచేసే పార్టీ అని, కొత్త పాత నాయకులు కలిసికట్టుగా పని చేస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అభివృద్ధి మరియు ప్రజా సేవే లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో తరాలపల్లి గ్రామం నుండి దాసరి రాజు, కాట్రేవుల నాగరాజు, కాట్రేవుల రాజు, కాగిత శ్రావణ్ కుమార్, వేల్పుల హరి, దాసరి నితిన్, నన్నే బోయిన అజయ్, వేల్పుల నరేష్ ఉండగా, కుమారిగూడెం గ్రామం నుండి బోయ బిక్షపతి, మోట్ల కిషన్, నందు, నర్మెట మనవిత, నార్లగిరి పురుషోత్తం, ఆరూరి ప్రతాప్, ఆరూరి బాబు, పైడిపాల హరీష్, ఆరూరి ఐలయ్య (వినయ్ బాబు), దేవర మల్లేష్, విక్రమ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సారంపల్లి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు కర్ర హరీష్ రెడ్డి, నాయకులు కుర్ల మోహన్, ఎండి బషీర్, గుర్రం అమర్నాథ్, తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *