నేటి తాజా సంక్షిప్త సమాచారం .. కరోనా వార్తల సమాహారం

ఆంధ్రప్రదేశ్‌ :
► నేడు వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌.. వీడియో కాన్ఫరెస్స్‌ ద్వారా డ్వాక్రా మహిళలతో మాట్లాడనున్నారు. ఈ పథకం ద్వారా 8.78 లక్షల మహిళా స్వయంసహాయక సంఘాల్లో 93 లక్షలమంది సభ్యులకు లబ్ధి చేకూరనుంది.
►  ఏపీలో మొత్తం 893 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 141 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. 
తెలంగాణ : 
► నేడు అనంతగిరి సాగర్‌ రిజర్వాయర్‌ నుంచి రంగనాయక సాగర్‌లోకి గోదావరి జలాలను విడుదల చేయనున్నారు. మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌ పంపులు ఆన్‌ చేసి గోదావరి జలాలను వదలనున్నారు. 
► తెలంగాణలో మొత్తం 970 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 262 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు.  
జాతీయం :
► భారత్‌ కరోనా కేసుల సంఖ్య 21,393కి చేరింది. దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి 4,257 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. 681 మంది మృతిచెందారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *