మధురలోని షాహీ ఈద్గా మసీదు సర్వే కోసం కోర్టు కమిషనర్‌ను నియమిస్తామని అలహాబాద్ హైకోర్టు తెలిపింది. శ్రీకృష్ణుడి ఆలయాన్ని కూల్చివేసి మసీదు నిర్మించారని, సర్వే చేస్తే నిజానిజాలు బయటకు వస్తాయని హిందూ పార్టీ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని అనుమతించింది. ఇందుకు సంబంధించిన విధి విధానాలను ఈ నెల 18న ఖరారు చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు జస్టిస్ మయాంక్ కుమార్ జైన్ ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.