60వ డివిజన్ పరిధిలోని వడ్డేపల్లిలో జరుగుతున్న అభివృద్ధి పనులను సందర్శించిన స్థానిక కార్పొరేటర్ డా. దాస్యం అభినవ్ భాస్కర్.

తేది:07-03-2026 హనుమకొండ TSLAWNEWS పశ్చిమ నియోజక వర్గం ఇంచార్జి దొమ్మటి పవన్ గౌడ్.

వరంగల్ జిల్లా: ఈ సందర్భంగా జరుగుతున్న పనులను పరిశీలించి, పనులు నాణ్యత ప్రమాణాలతో, వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనుల్లో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులు సమయానికి పూర్తిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఈ.ఈ రవి, డి.ఈ రాజ్ కుమార్, ఏ.ఈ సారంగం, వర్క్ ఇన్స్పెక్టర్ రవి, బిజెపి డివిజన్ అధ్యక్షులు సతీష్, జిల్లా కౌన్సిల్ సభ్యులు యాదగిరి, ఓబీసీ మోర్చా జిల్లా అధికార ప్రతినిధి అశోక్, బిజెపి నాయకులు రామరాజు, నరేష్, శివ, తమ్ముడి సిద్ధార్థ్, ఓబీసీ మోర్చా డివిజన్ అధ్యక్షులు రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *