దావత్-ఏ-ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు.

తేది: 07-03-2026 హనుమకొండ TSLAWNEWS పశ్చిమ నియోజక వర్గం ఇంచార్జి దొమ్మటి పవన్ గౌడ్.

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం పరిధిలోని ఇల్లంద గ్రామంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ అధ్యక్షుడు శ్రీ మొహమ్మద్ చోటే ఆధ్వర్యంలో నిర్వహించిన దావత్-ఏ-ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథిగావర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజుపాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు గారు మాట్లాడుతూ రంజాన్ మాసం పవిత్రత, త్యాగం, సహనం మరియు సేవా భావానికి ప్రతీక అని అన్నారు. ఉపవాస దీక్ష ద్వారా మనిషిలో నియంత్రణ, పరస్పర గౌరవం మరియు సోదరభావం పెరుగుతాయని తెలిపారు.సమాజంలో అన్ని మతాల వారు పరస్పర గౌరవంతో, ఐక్యతతో జీవించాలనే సందేశాన్ని రంజాన్ పండుగ అందిస్తుందని పేర్కొన్నారు. దేశంలో మత సామరస్యాన్ని కాపాడుతూ అందరూ కలిసి ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక మైనారిటీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *