ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో దళపతి విజయ్ (Kollywood Star Hero Vijay) వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. విజయ్ తన భార్య సంగీత (Sangeetha)తో విడాకులు తీసుకోబోతున్నారనే ప్రచారం ఒకవైపు, అందుకు కారణం హీరోయిన్ త్రిష అని మరో వైపు వార్తలు వస్తున్న తరుణంలో.. వీరిద్దరూ పెళ్లి వేడుకకు కలిసి ఒకే కారులో రావడం, వేదికపై నూతన జంటను ఆశీర్వదించడంతో అనుమానాలన్నీ నిజమే అనేలా పబ్లిక్‌లోకి మెసేజ్ పంపించారు. ఇలా విజయ్, త్రిష (Vijay and Trisha)ల మధ్య ఏదో ఉందనే రూమర్స్ నెట్టింట వైరల్ అవుతున్న తరుణంలో, నెటిజన్లు త్రిషకు సంబంధించిన పాత విషయాలను మళ్ళీ వెలికితీస్తున్నారు. ముఖ్యంగా ఆమె గతంలో చేసుకున్న నిశ్చితార్థం తాలూకు ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. ఒకప్పుడు ఎంతో ఘనంగా జరిగిన ఆ వేడుకకు సంబంధించిన జ్ఞాపకాలను తవ్వి తీస్తూ, ప్రస్తుత పరిస్థితులతో ముడిపెట్టి నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
త్రిష పాత ఎంగేజ్‌మెంట్ ఫొటోస్ వైరల్
2015లో త్రిషకు వ్యాపారవేత్త వరుణ్ మనియన్‌తో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. అప్పట్లో వీరిద్దరి జంట చూడముచ్చటగా ఉందని అందరూ మెచ్చుకున్నారు. మరి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, కొన్ని కారణాలతో ఆ నిశ్చితార్థం క్యాన్సిల్ అయ్యింది. నిశ్చితార్థంతోనే వారి పెళ్లి ఆగిపోయింది. ఇప్పుడు విజయ్‌తో త్రిష రిలేషన్‌లో ఉందనే ప్రచారం ఊపందుకోవడంతో, నయనతార (Nayanthara) అప్పట్లో వరుణ్-త్రిషలకు శుభాకాంక్షలు చెబుతూ చేసిన పాత సోషల్ మీడియా పోస్ట్‌లను కూడా కొందరు స్క్రీన్ షాట్స్ తీసి షేర్ చేస్తున్నారు. ఇలాంటి వివాదాస్పద సమయంలో పాత ఫొటోలను బయటకు తీయడం కోలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. నయనతార వంటి స్టార్ హీరోయిన్ చేసిన ఆ పాత పోస్ట్ ఇప్పుడు ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లయింది.
ఆందోళనలో అభిమానులు
ఈ పరిణామాలన్నీ చూస్తుంటే విజయ్ తన రాజకీయ ప్రవేశం వేళ ఇలాంటి వ్యక్తిగత విమర్శలు ఎదుర్కోవడం ఆయన అభిమానులను కలవరపెడుతోంది. విజయ్ తన TVK పార్టీతో బిజీగా ఉండగా, సినిమా రంగంలో కూడా తన చివరి చిత్రాన్ని ఇటీవలే పూర్తి చేశారు. ఆ సినిమా విడుదలకు నోచుకోవడం లేదు. సినిమానే కాంట్రవర్సీలో ఉంది అనుకుంటుంటే.. మరోవైపు త్రిష వ్యవహారం కూడా విజయ్ నేమ్‌ని డౌన్ చేస్తోంది. రాజకీయ పార్టీ పెట్టి, పోటీ చేయాలని అనుకున్నప్పుడు ఇలాంటి వాటికి విజయ్ దూరంగా ఉంటే బాగుండేదని ఆయన అభిమానులు సైతం హితబోధ చేస్తున్నారు. మరోవైపు విజయ్‌కు సంబంధించి ఏం దొరుకుతుందా? అని కూర్చున్న ఇతర పార్టీలకు ఆయన స్వయంగా చేతికి పెద్ద హార్డ్ డిస్కే ఇచ్చినట్లయింది. ఇక విజయ్, త్రిషల వ్యవహారానికి సంబంధించి అటు విజయ్ గానీ, ఇటు త్రిష గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలోనే ఆ రోజు కూడా వస్తుందనేలా టాక్ నడుస్తుంది.