రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలిచేందుకు వైసిపి ఉవ్విళ్ళూరుతోంది. ఇదివరకే జగన్ సర్వే చేయించారు. వ్యతిరేకత మూటగట్టుకున్నసిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి ఇతరులను ఇన్చార్జులుగా నియమించే పనిలో వైసీపీ అధిష్టానం నిమగ్నమైంది. ఇప్పటికే 11 చోట్ల ఇన్చార్జిలను మార్చిన వైసీపీ మరో 65 చోట్ల అభ్యర్థులను మార్చేందుకు సిద్ధమైంది.!. జనాల్లోని వ్యతిరేకతను పోగొట్టేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానంలో ఇతరులను ఇంచార్జులుగా నియమించనుంది.