బిగ్ బాస్ సీజన్ 7కు ఈ వారంతో ఎండ్ కార్డు పడనుంది. అయితే ఈ బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకు ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలు వస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఆ హీరోలు ఒకరు నందమూరి బాలకృష్ణ కాగా.. ఇంకొకరు సూపర్ స్టార్ మహేష్ బాబు. శని, ఆది వారాల్లో జరిగే ఒక ఎపిసోడ్‌కు వీరిద్దరూ రాబోతున్నట్లు సమాచారం. అయితే దీనిపై బిగ్ బాస్ నిర్వహకులు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.