ధురంధర్ ఎఫెక్ట్.. దెబ్బకు వెనక్కి తగ్గిన మూవీస్..!

సాధారణంగా ఒక స్టార్ హీరో లేదా ఒక స్టార్ డైరెక్టర్ సినిమా వస్తోందంటే.. ఆ సినిమా విడుదల తేదీ సమయాలలో మిగతా సినిమాలు లేకుండా జాగ్రత్త పడడం ఆనవాయితీగా వస్తోంది . ఇప్పటికే అలా ఒక డేట్ ను అనుకున్న తర్వాత ఆ డేట్ సమయంలో వేరే పెద్ద సినిమాల విడుదల ఉంటే మాత్రం చిన్న సినిమాలు దాదాపుగా తప్పుకున్న ఎన్నో సందర్భాలు మనం చూసాం.. అయితే ఇప్పుడు ఒక చిత్రం దెబ్బకి ఆ సినిమా సీక్వెల్ విడుదల కాబోతుండడంతో స్టార్ హీరోలు కూడా తమ సినిమాల తేదీలను మార్చుకోవడం ఇండస్ట్రీలో వైరల్గా మారింది.

 

కలెక్షన్స్ సునామీ కురిపించిన ధురంధర్

అదేదో కాదు బాలీవుడ్ మూవీ ధురంధర్. రణవీర్ సింగ్ హీరోగా.. ఆదిత్య ధర్ దర్శకత్వంలో చైల్డ్ ఆర్టిస్ట్ సారా అర్జున్ హీరోయిన్ గా తొలి పరిచయంలో వచ్చిన చిత్రం ఇది.. మొదటి షో హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో ఊహించని కలెక్షన్స్ వచ్చి పడ్డాయి.. ముఖ్యంగా ఈ సినిమా ఫుల్ రన్ ముగిసే సరికి 1360 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా ఏడు దేశాలలో నంబర్వన్ స్థానాన్ని దక్కించుకుంది ఈ సినిమా . అతి తక్కువ సమయంలో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ సినిమాకి మేకర్స్ సీక్వెల్ కూడా ప్రకటించారు.

 

లైన్ క్లియర్ చేసుకుంటున్న ధురంధర్ 2..

ఇప్పటికే ఈ సీక్వెల్ నుండి విడుదలైన టీజర్ కూడా సినిమాపై ఆసక్తిని పెంచింది . దీనికి తోడు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న యామి గౌతమ్ అలియాస్ డైరెక్టర్ భార్య సినిమా గురించి మాట్లాడుతూ అంచనాలు మరింత పెంచేసింది. ముఖ్యంగా సినిమాలోని ఆ పది నిమిషాలు సినిమాకి చాలా కీలకం అంటూ ఆమె చేసిన కామెంట్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. అలా ఒక్కొక్కరు ఈ సినిమాపై అంచనాలు పెంచుతున్న నేపథ్యంలోనే సీక్వెల్ మార్చి 19 న రాబోతుందని ప్రకటించారు. కాబట్టి ఆ తేదీ సమీపంలో ఉన్న మిగతా చిత్రాలు కూడా తమ విడుదల తేదీని వాయిదా వేసుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

 

ధురంధర్ దెబ్బకు వాయిదా పడ్డ సినిమాలు..

ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అడివి శేష్ డెకాయిట్ సినిమా మార్చి 19న రిలీజ్ చేయాల్సి ఉండగా. ఏప్రిల్ 10 కి ఈ సినిమాను వాయిదా వేశారు. ఇక పెద్ది సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . మార్చి 27వ తేదీన రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించినా.. తెలంగాణ టికెట్ రేట్ నియమం ప్రకారం ఏప్రిల్ 30కి ఈ సినిమాను వాయిదా వేశారు ఇకపోతే ఎప్పటినుంచో ధురంధర్ 2 సినిమాకి పోటీగా టాక్సిక్ సినిమా రాబోతుందంటూ వార్తలు వినిపించినా ఇప్పుడు టాక్సిక్ కూడా ఈ బరి నుంచి తప్పుకున్నట్లు సమాచేశం.మార్చి 19న రావాల్సిన ఈ సినిమా జూన్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక అలాగే నాని ది ప్యారడైజ్ సినిమా కూడా మార్చి 26వ తేదీన రావాల్సి ఉండగా.. ఆగస్టు 21న డేటు ఫిక్స్ చేసుకుంది . మొత్తానికి అయితే దురంధర్ దెబ్బకు సీక్వెల్ కి లైన్ క్లియర్ అయింది . దాదాపుగా నలుగురు పెద్ద హీరోలు తమ సినిమాలను వాయిదా వేసుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ధురంధర్ తో సంచలనం సృష్టించిన రణవీర్ సింగ్ ఇప్పుడు ధురంధర్ 2 తో సోలో రిలీజ్ తో మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మరి ఇక్కడ ఈ సినిమాతో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *