ఈ శుక్రవారం థియేటర్లో విడుదలయ్యే సినిమాల లిస్ట్ ఇదే..!

మార్చి నెల మొదటి వారం అర డజనుకు పైగా సినిమాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. చిన్న, పెద్ద చిత్రాలు కలిపి మొత్తం 9 సినిమాలు థియేటర్లలో సందడి చేయడానికిక రెడీగా ఉన్నాయి. యాక్షన్, థ్రిల్లర్ నుంచి కామెడీ డ్రామాల వరకు వివిధ జానర్లలో రాబోతున్న ఈ సినిమాల వివరాలు ఓ లుక్కేయండి మరి.

 

మృత్యుంజయ్ (MrithyunJay)

యంగ్ హీరో శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్ జంటగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ ఇది. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. శ్రీవిష్ణు మరోసారి ఒక విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

 

సాంప్రదాయిని సుప్పినీ సుద్దపూసనీ (Sampradayini Suppini Suddapoosani)

చాలా కాలం తర్వాత శివాజీ, లయ ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ కామెడీ డ్రామా ఇది. ఒక ఊరి సర్పంచ్ కుటుంబం చిక్కుల్లో పడి, ప్రాణాల నుంచి తప్పించుకోవడానికి చేసే రోడ్ జర్నీ చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

 

సరస్వతి (S Saraswathi)

విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ఇందులో ప్రియమణి, ప్రకాష్ రాజ్, రావు రమేష్ వంటి భారీ తారాగణం నటించారు. మహిళా సాధికారత, సామాజిక అంశాల నేపథ్యంలో సాగే ఈ చిత్రంపై పరిశ్రమలో పాజిటివ్ టాక్ ఉంది.

 

మాన్షన్ హౌస్ మల్లేష్ (MansionHouse Mallesh)

శ్రీనాథ్ మాగంటి, గాయత్రి రమణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా పక్కా గ్రామీణ నేపథ్యంలో సాగే కామెడీ ఎంటర్టైనర్. మద్యానికి బానిసైన ఒక యువకుడి జీవితం, అతని పెళ్లి చుట్టూ జరిగే పరిణామాలు ఇందులో నవ్వులు పూయించనున్నాయి.

 

రాయుడు గారి తాలూకా

ఉలిశెట్టి శ్రీనివాసరావు, సత్య ఈషా జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్. కుటుంబ విలువలకు పెద్దపీట వేస్తూ, కమర్షియల్ హంగులతో ఈ సినిమాను తెరకెక్కించారు.

 

ఇతర సినిమాలు..

 

కాక్రోచ్: ఇదొక విభిన్నమైన కాన్సెప్ట్‌తో వస్తున్న ప్రయోగాత్మక చిత్రం.

 

మిషన్ C 1000: సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లో రూపొందిన సినిమా.

 

చెస్మా రాజా సెల్ఫీ రాణి: హారర్ కామెడీ జానర్‌లో వీరేంద్ర బాబు హీరోగా పరిచయమవుతున్న చిత్రం.

 

కాన (డబ్బింగ్): తమిళంలో మంచి విజయం సాధించిన ఒక ఇంటెన్స్ డ్రామా తెలుగులోకి ‘కాన’ పేరుతో డబ్ అయ్యి వస్తోంది.

 

ఈ వారం బాక్సాఫీస్ వద్ద మృత్యుంజయ్, సరస్వతి, సాంప్రదాయిని సుప్పినీ సుద్దపూసనీ చిత్రాల మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. అయితే ఈ రేసులో ఏ సినిమా గెలుస్తుందో చూడాలి మరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *