జన్మదినం సందర్భంగా భద్రకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు.

తేది :04-03-2026 హనుమకొండTSLAWNEWS వడ్డేపల్లి రిపోర్టర్ కందాల శ్రీకాంత్ గౌడ్.

వరంగల్ జిల్లా: వరంగల్ నగరంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రకాళి దేవాలయంను గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు తమ జన్మదినం సందర్భంగా దర్శించుకున్నారు.తొలుత ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.అనంతరం వేద పండితులు వేద మంత్రాలతో ఘనంగా ఆశీర్వాదం అందిచారు.తదనంతరం సాయిబాబా ఆలయం ప్రవేశించి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.అదే విధంగా నాయకులు కార్యకర్తలు భద్రకాళి ఆలయ ముందు కేక్ కట్ చేయించి పండ్లు ఎమ్మెల్యే చేత పంపిణీ చేయంచారు.ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజల సుఖసంతోషాలు, శ్రేయస్సు, అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు.తమ జన్మదినాన్ని సాదాసీదాగా, ఆధ్యాత్మిక వాతావరణంలో జరుపుకుంటూ ప్రజాసేవలో మరింత కృషి చేస్తానని ఎమ్మెల్యే నాగరాజు తెలిపారు.అనంతరం ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఎమ్మెల్యే నాగరాజు కి శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *