వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే నాగరాజు.

తేది:03-03-2026 హనుమకొండ TSLAWNEWS వడ్డేపల్లి రిపోర్టర్ కందాల శ్రీకాంత్ గౌడ్.

వరంగల్ జిల్లా: సహజ సిద్ధ రంగులతో పండుగ జరుపుకోవాలన్న ఎమ్మెల్యే నాగరాజు.హోలీ పర్వదినం సందర్భంగా వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు గౌరవ వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి *శ్రీ కేఆర్ నాగరాజు.ప్రేమ, ఆప్యాయత, సంతోషాల హరివిల్లుగా, శాంతి సౌభ్రాతృత్వాలకు ప్రతీకగా నిలిచే ఈ హోలీ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని కోరారు. సహజ సిద్ధమైన రంగులతో, సంప్రదాయ పద్ధతుల్లో ఈ రంగుల పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.హోలీ అనేది జీవితం, ప్రేమ, రంగుల వేడుక అని పేర్కొంటూ — ప్రేమ, దయ, కరుణలను వ్యాప్తి చేసి ప్రపంచాన్ని మరింత అందమైన, సామరస్యపూర్వక ప్రదేశంగా మార్చుకుందామని పిలుపునిచ్చారు.ఇతరులకు లేదా పర్యావరణానికి హాని కలిగించే చర్యలను నివారించి, పండుగను సురక్షితంగా, బాధ్యతాయుతంగా జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.అలాగే ప్రజా రవాణా, వ్యాపార కార్యకలాపాలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా హోలీ వేడుకలను నిర్వహించాలని వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలందరికీ ఎమ్మెల్యే నాగరాజు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *