లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా 320F, 7వ రీజియన్ చంద్రగిరి సేవ సమ్మేళనం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే నాగరాజు.

తేది:02-03-2026 హనుమకొండTSLAWNEWS వడ్డేపల్లి రిపోర్టర్ కందాల శ్రీకాంత్ గౌడ్.

వరంగల్ జిల్లా: జనగామ జిల్లా సూర్యాపేట క్రాస్ రోడ్డు లోని భ్రమరాంబ కన్వెన్షన్ హాల్ నందు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా 320F, 7వ రీజియన్ చంద్రగిరి సేవ సమ్మేళనం ముఖ్య అతిథిగా హాజరైన గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు తొలుత ఎమ్మెల్యే నాగరాజు ఉద్యోగ ప్రస్థానాన్ని లయన్స్ సభ్యులకు వివరించారు.ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని మదర్ థెరిస్సా చెప్పారని, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని, కరోనా సమయంలో లయన్స్ క్లబ్ చేపట్టిన సేవా కార్యక్రమాలు ఎంతోమంది ప్రాణాలను కాపాడాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. లయన్స్ క్లబ్ తో తనకు అభినాభావ సంబంధం ఉందని, జనగామలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం ఎంతో సంతోషంగా ఉందని, తాను పోలీస్ శాఖలో సేవలు అందించిన సమయంలో మద్దూరు, చేర్యాల, పాలకుర్తి ప్రాంతాలలో విధులు నిర్వర్తించానని, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు తన వంతు సహాయ, సహకారాలు అందజేస్తానని చెప్పారు. తాను పోలీస్ శాఖలో అధికారిగా ఉన్న, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న నిత్యం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, లయన్స్ క్లబ్ సహకారంతో నియోజకవర్గంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రిసైడింగ్ ఆఫీసర్ & రీజియన్ ఛైర్పర్సన్ చంద్రగిరి శ్రీనివాస్ – కవిత, శ్రీనివాస రావు, చంద్రశేఖర్, రిటైర్డ్ డీసీపీ జనార్ధన్, సుధాకర్ రెడ్డి, అజిత్ రెడ్డి తో పాటు తదితర లయన్స్ పెద్దలు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *