తేది:01-03-2026 వికారాబాద్ జిల్లా TSLAWNEWS వికారాబాద్ నియోజక వర్గ రిపోర్టర్ లక్ష్మీనారాయణ.
వికారాబాద్ జిల్లా: వికారాబాద్ సమీపంలో గల శుభ గృహ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, మేనేజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని జిల్లా ఉపాధికారి అబ్దుల్ సుభాన్ గారు తెలియజేశారు. ఇట్టి ఉద్యోగాలకు పదవ తరగతి, ఇంటర్మీడియట్ ,డిగ్రీ, ఐటిఐ ఇంజనీరింగ్, ఎంబీఏ చేసిన వారు అర్హులని తెలియజేశారు. ఇంటర్వ్యూలకు రేపు వికారాబాద్ ప్రభుత్వ ఐటిఐ లో ఉదయం 10 గంటలకు హాజరు కావాలని సూచించడం జరిగింది.