- న్యూఢిల్లీలో భారత ఎన్నికల కమిషన్ కార్యాలయాన్ని ఆశ్రయించిన- బీసీవై పార్టీ సంగారెడ్డి నియోజకవర్గం ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్.
- ఈవీఎం మెషిన్లకు ఆధార్ లింక్ మరియు బయోమెట్రిక్ అనుసంధానం చేయాలి- బీసీవై పార్టీ సంగారెడ్డి నియోజకవర్గం ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్.
న్యూఢిల్లీ, భారత ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించిన బీసీవై పార్టీ సంగారెడ్డి నియోజకవర్గం ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మరియు జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు. ఈ సందర్భంలో బీసీవై పార్టీ సంగారెడ్డి నియోజకవర్గం ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజలచే ఎన్నుకోబడే ప్రజా పరిపాలనలో భాగంగా నిర్వహించే ఎన్నికలను ఈవీఎం మెషిన్లకు ఆధార్ లింక్ మరియు బయోమెట్రిక్ విధానాన్ని అనుసంధానం చేసి నిర్వర్తిస్తే ఎన్నికల విధానంలో ఎటువంటి అవకతవకలు జరగకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత మన అందరిదని అందులో భాగంగా భారత ఎన్నికల కమిషన్ ఇట్టి విషయంలో చిత్తశుద్ధి వహించి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ముందు ముందు జరగబోయే ఎన్నికల్లో ఈవీఎం మెషిన్లకు ఆధార్ లింక్ మరియు బయోమెట్రిక్ మిషన్ ను అనుసంధానం చేసి నిర్వహించాలని భారత ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో తెలంగాణ బీసీవై పార్టీ నాయకులు మరియు జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు.