జవహర్ నవోదయ విద్యాలయం కొరకు స్థల పరిశీలన – జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్. లత.

తేది:25-02-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.

జగిత్యాల జిల్లా: బుధవారం కోరుట్లలో ప్రతిపాదించిన జవహర్ నవోదయ విద్యాలయ కొరకు స్థలం పరిశీలించారు.
ఈ సందర్భంగా విద్యాలయం నిర్మాణానికి అనుకూలంగా గుర్తించిన స్థలాన్ని సవివరంగా పరిశీలించారు. భూమి విస్తీర్ణం, సరిహద్దులు, రహదారులు, మౌలిక సదుపాయాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం కల్పించే విధంగా స్థలం ఎంపిక కావాలని సూచించారు. అన్ని శాఖల సమన్వయంతో అవసరమైన నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. భూమికి సంబంధించిన రికార్డులను పరిశీలించి ఎలాంటి వివాదాలు లేకుండా చూడాలని రెవెన్యూ అధికారులకు తెలిపారు. తాగునీరు, విద్యుత్, రహదారి సదుపాయాలు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాటుతో ప్రాంతీయ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందని తెలిపారు. పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రతిపాదనలను ఉన్నతాధికారులకు పంపించాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని ప్రక్రియలు పారదర్శకంగా నిర్వహించాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కోరుట్ల ఆర్డీవో జీవాకర్ రెడ్డి, తహసీల్దార్ కృష్ణ చైతన్య, డిప్యూటీ తహసీల్దార్ ఫరూక్, సంబంధిత శాఖల అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *