రాష్ట్రస్థాయి పోలీస్ స్పోర్ట్స్ మీట్లో కానిస్టేబుల్ సత్తా,వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ పోటీల్లో రజత, కాంస్య పతకాలు కైవసం.

తేది:21-02-2026 హనుమకొండ TSLAWNEWS పశ్చిమ నియోజక వర్గం ఇంచార్జి దొమ్మటి పవన్ గౌడ్.

వరంగల్ జిల్లా : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో సైబరాబాద్ కార్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ గ్రౌండ్లో మూడు రోజులుగా నిర్వహిస్తున్న 4వ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ 2026 పోటీల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ పి. సర్వేష్ పలు విభాగాల్లో పాల్గొని సత్తా చాటి పతకాలను కొల్లగొట్టడు. ఓపెన్ టు ఆల్ 84 కేజీల వెయిట్రిఫ్టింగ్లో ద్వితీయ స్థానంలో నిలిచి రజత పతకం తో పాటు పవర్ లిఫ్టింగ్లో సైతం అద్భుత ప్రతిభ చాటి తృతీయ స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించి జిల్లా కు కీర్తి, ప్రతిష్టలు తీసుకువచ్చాడు. చిన్ననాటి నుంచి అథ్లెటిక్స్లో అత్యుత్తమ ప్రతిభతో రాష్ట్ర జాతీయస్థాయి వేదికల్లో పాల్గొని స్వర్ణ, రజత, కాంస్య పతకాలను సాదించడం లో సర్వేష్ దిట్ట. ప్రస్తుతం సర్వేష్ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రాయపర్తి పోలీస్ స్టేషన్ కాని స్టేబుల్ విధులు నిర్వహిస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *