రష్మిక మమ్మల్ని పెళ్లికి పిలవదు..! ఆ నటుడు షాకింగ్ కామెంట్స్..?

రష్మిక తమను పెళ్లికి పిలవదని తమకు తెలుసని ప్రముఖ నటుడు ప్రమోద్ శెట్టి అన్నారు. రష్మికకు నటుడు రక్షిత్ శెట్టితో గతంలో నిశ్చితార్థం జరిగింది. అయితే వివాహం జరగకుండానే వీరిద్దరు విడిపోయారు. ఈ నేపథ్యంలో రక్షిత్ శెట్టి సన్నిహితుడు ప్రమోద్ రష్మిక, విజయ్ దేవరకొండ వివాహంపై స్పందించారు. తనకు ఆహ్వానం అందలేదని, అందితే వెళతానని చెప్పారు.

 

అయితే వారి వివాహానికి తనను, రక్షిత్ శెట్టిని ఆహ్వానిస్తారని వేచి చూడటం లేదని తెలిపారు. రష్మికకు ఆహ్వానించే ఉద్దేశం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. రక్షిత్ శెట్టి ప్రస్తుతం సినిమా పనుల్లో బిజీగా ఉన్నారని వెల్లడించాడు. రష్మికతో వివాహం జరగనందుకు రక్షిత్ బాధపడటం లేదని పేర్కొన్నారు. చాక్లెట్ తింటూ అదే విషయం గురించి ఆలోచించడానికి అతనేం పిల్లవాడు కాదన్నారు. ఈ విషయం ఆయన సన్నిహితులందరికీ తెలుసని చెప్పారు.

 

ఈ నెల 26న విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్ వేదికగా జరగనున్నట్టు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *