తేది:18-02-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS ఇస్రితాబాద్ గ్రామ రిపోర్టర్ మర్పల్లి రాజ్ కుమార్.
సంగారెడ్డి జిల్లా: సదాశివపేట పట్టణ మున్సిపల్ చైర్మన్ గా నియమితులైన మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ మరియు వైస్ చైర్మన్ గా నియమితులైన రేణుక చిరంజీవి గారిని ఇస్రితాబాద్ గ్రామ సర్పంచ్ బలరాం శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది.అనంతరం కౌన్సిలర్ గా ఎన్నికైన పులిమామిడి మమత రాజు గారిని కూడా సన్మానించడం జరిగింది. కార్యక్రమంలో ఇస్రితాబాద్ గ్రామ ఉప సర్పంచ్ కట్టేగోసే శ్రీనివాస్, వార్డు సభ్యులు రషీద్,రాములు, రమేష్, ఇర్ఫాన్, ఇస్రితాబాద్ గ్రామ మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు రాములు మరియు సునీల్ కుమార్,వెంకటేష్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.