తేది:14-02-2026 TSLAWNEWS మెదక్ జిల్లా హవేలి ఘణపూర్ మండలం రిపోర్టర్ జండాకాడి సందీప్ గౌడ్.
మెదక్ జిల్లా: హవేలి ఘనాపురం మండలం కూచనపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.పొలం వద్ద ఉన్న వ్యవసాయ బోరుబావికి సంబంధించిన విద్యుత్ వైరు మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి రైతు కూకుట్ల లచ్చయ్య (లచ్చన్న) అక్కడికక్కడే కుప్పకూలారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
లచ్చయ్య గ్రామంలో అందరితో కలిసిమెలిసి ఉండే, సహాయక స్వభావం కలిగిన వ్యక్తిగా మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన ఆకస్మిక మరణం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. విషయం తెలిసిన వెంటనే స్థానిక ప్రజలు, రైతులు పెద్ద సంఖ్యలో చేరుకుని కుటుంబ సభ్యులకు పరామర్శలు తెలిపారు.
లచ్చన్న మృతి పట్ల గ్రామస్తులు గాఢ సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. కుటుంబానికి ప్రభుత్వం తగిన ఆర్థిక సహాయం అందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.