‘ఆలయాలను ప్లాస్టిక్ రహిత దేవాలయాలుగా మార్చుదాం’.

తేది:14-02-26 TSLAWNEWS జగిత్యాల్ జిల్లా, మల్యాల మండలం, రిపోర్టర్ కుందారపు రమేష్.

జగిత్యాల జిల్లా: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దేవాలయాలను ప్లాస్టిక్ రహిత ఆలయాలుగా మార్చుటకు సహకరించాలని మల్యాల గ్రామ పురోహితులు ప్రణీత్ శర్మ భక్తులకు విజ్ఞప్తి చేశారు. స్వామివారి అభిషేకానికి వచ్చే భక్తులు పాలను ప్లాస్టిక్ బాటిల్స్ లో కాకుండా స్టీల్ పాత్రలో తీసుకురావాలని సూచించారు, అలాగే కొబ్బరికాయలు, పూజాసామాగ్రి ప్లాస్టిక్ కవర్లో కాకుండా క్లాత్ బ్యాగ్ లేదా జ్యూట్ బ్యాగులో తీసుకొచ్చి ఆలయాలను ప్లాస్టిక్ రహిత ఆలయాలుగా తీర్చిదిద్దుటకు సహకరించాలని భక్తులకు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *