శ్రీ దుబ్బరాజేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలు,ముత్యాల తలంబ్రాలు సమర్పించిన జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ దంపతులు-పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు.

తేది:14-02-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.

జగిత్యాల జిల్లా: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం సారంగాపూర్ మండలం పెంబట్ల కోనాపూర్ గ్రామంలో వెలసిన శ్రీ దుబ్బరాజేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవానికి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ దంపతులు హాజరై పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అనంతరం ఆలయ అర్చకులు, వేద పండితులు కలెక్టర్ దంపతులను ఆశీర్వదించి శాలువాతో ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు.
దుబ్బ రాజన్న ఆలయ ఆవరణలో ఏర్పాటుచేసిన కల్యాణవేదికపై శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని జిల్లా కలెక్టర్ దంపతులు మరియు విశేషంగా హాజరైన భక్తులు తిలకించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ మాట్లాడుతూ:
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ ఆధ్యాత్మిక శాంతి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మరియు శివపార్వతుల దివ్య ఆశీస్సులు జిల్లా ప్రజలందరికీ కలగాలని ఆకాంక్షించారు జాతరకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని, శానిటేషన్, పారిశుద్ధ్య నిర్వహణ నిరంతరం చేపట్టాలని, భక్తుల అధిక రద్దీని దృష్టిలో ఉంచుకొని సురక్షిత త్రాగునీటి సౌకర్యం సమృద్ధిగా కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అందరు అధికారులు సమన్వయంతో పని చేస్తూ భక్తులందరికీ అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు
ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ, ఆలయ ఈవో అనూష ,ఎమ్మార్వో వహీద్, ఎంపీడీవో సలీం, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *