తేది:14-2-2026 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ విజయ్ మురళీకృష్ణ.
హైదరాబాద్: అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ సులేమాన్ నగర్ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.
ప్రముఖ అడ్వకేట్ మహమ్మద్ ఖదీర్‌ను గుర్తుతెలియని దుండగులు కత్తులతో దారుణంగా హత్య చేశారు.
తన ఆఫీసులో ఒంటరిగా ఉన్న సమయంలో అక్కడికి వచ్చిన దుండగులు ఒక్కసారిగా దాడి చేసి పలుమార్లు పొడవడంతో ఖదీర్ స్పాట్‌లోనే మృతి చెందాడు.
దాడి అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.
ఘటన సమాచారం అందుకున్న వెంటనే అత్తాపూర్ పోలీసులు, క్లూస్ టీమ్ చేరుకుని ఆధారాలు సేకరించారు. ప్రాథమికంగా కుటుంబ విభేదాల నేపథ్యంలో బామ్మర్దులపై అనుమానం వ్యక్తమవుతోంది.
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి.
హత్యకు గల అసలు కారణాలపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.