తేది:11- 02- 2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లా: ధర్మపురి, జగిత్యాల, మెట్ పెల్లి మరియు కోరుట్ల మున్సిపల్ కేంద్రంల్లో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా పరిధిలోని 5 మున్సిపాలిటీలలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాటు చేసిన సదుపాయాలు, పోలింగ్ సామగ్రి వినియోగం, బ్యాలెట్ యూనిట్లు మరియు కంట్రోల్ యూనిట్ల పనితీరును సమీక్షించారు. పోలింగ్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్న తీరు గురించి వివరాలు తెలుసుకుని, ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలని సూచించారు. ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లు సక్రమంగా నిర్వహించాలని, వృద్ధులు మరియు దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. భద్రతా ఏర్పాట్లపై పోలీసు అధికారులతో చర్చించి, ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగుతున్నందుకు సంతృప్తి వ్యక్తం చేశారు. ఓటర్ల గుర్తింపు ధృవీకరణ ప్రక్రియ, సీసీ కెమెరాల పర్యవేక్షణ, వెబ్‌కాస్టింగ్ వంటి ఏర్పాట్లపై కూడా ఆరా తీశారు. ఏవైనా సమస్యలు తలెత్తిన పక్షంలో వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సమన్వయంతో పనిచేసి ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
జిల్లా లోని 5 మున్సిపాలిటీలలో పోలింగ్ సజావుగా కొనసాగుతోందని తెలిపారు.
ఈ పరిశీలనలో స్పెషల్ ఆఫీసర్లు, మున్సిపల్ కమిషనర్ లు, తహసీల్దార్ లు, ఎంపిడివోలు, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.