భూ సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరించాలి – జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత.

తేది:08-02-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.

జగిత్యాల జిల్లా: శనివారం భీమారం మండల తహసిల్దార్ కార్యాలయం ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బిఎస్ లత.
ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బిఎస్ లత మాట్లాడుతూ:
నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన భూ సమస్యలపై ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. మీసేవ సర్టిఫికెట్లను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని సర్టిఫికెట్ల ప్రజలకు అందించవలసిందిగా అధికారులను ఆదేశించారు. గ్రామస్థాయిలో దరఖాస్తు లను పెండింగ్ లేకుండా వెంటవెంటనే పరిశీలించేలా జిపివో లకు మార్గదర్శకం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ అన్ని గ్రామాల్లో సవ్యంగా జరిగేలా చూసే విధంగా బి ఎల్ వో లకు తగు సూచనలు జారీ చేయాలని ఆదేశించారు.
భీమారం తహసిల్దార్ రవి కిరణ్, రెవెన్యూ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *