కాంగ్రెస్ పార్టీ ఎనిమిదవ వార్డు మైనార్టీల సమస్యలను పరిష్కరిస్తా, 8వ వార్డు అభివృద్ధి చేసి చూపిస్తా- ఎనిమిదవ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిహెచ్ రేణుక శ్రీనివాస్ గౌడ్. మైనార్టీలకు అండగా నిలబడ్డ సిహెచ్ రేణుక శ్రీనివాస్ గౌడ్ గారిని సంపూర్ణంగా ఆశీర్వదించిన ఎనిమిదవ వార్డు మైనార్టీలు- ఎనిమిదవ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు నవాజ్, వసీం, యూసుఫ్.

తేది:07-02-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశిపేట పట్టణ క్రైమ్ రిపోర్టర్ ఆర్ నవాజ్ రెడ్డి.

మైనార్టీలకు అండగా నిలబడ్డ సిహెచ్ రేణుక శ్రీనివాస్ గౌడ్ గారిని సంపూర్ణంగా ఆశీర్వదించిన ఎనిమిదవ వార్డు మైనార్టీలు- ఎనిమిదవ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు నవాజ్, వసీం, యూసుఫ్.

సంగారెడ్డి జిల్లా: సదాశివపేట ఎనిమిదవ వార్డులో ప్రధానమైనటువంటి మంచినీటి సమస్య, రోడ్ల సమస్యలు, డ్రైనేజీ సమస్యలు, స్ట్రీట్ లైట్ల సమస్యలు పరిష్కరించండి అని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి సిహెచ్ రేణుక శ్రీనివాస్ గౌడ్ గారి దృష్టికి తీసుకెళ్లిన 8వ వార్డు మైనార్టీ సోదరి సోదరీమణులు, కచ్చితంగా ప్రజా పోరాటంలో భాగంగా 8వ వార్డు ప్రజా సమస్యలను పరిష్కరించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని ముందుకు కొనసాగుతానని శబదం చేసి ప్రచారంలో భాగంగా తెలియజేశారు. ఇట్టి తరుణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నవాజ్ 8వ వార్డు లోని ప్రజా సమస్యల పైన మైనార్టీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ముఖ్యంగా మైనార్టీ మహిళామూర్తులు చెప్పిన అంశాలను దృష్టిలో ఉంచుకొని మైనార్టీలకు న్యాయం చేయాలని కోరారు. అదేవిధంగా మైనార్టీలకు మద్దతుగా అండగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు నవాజ్ దగ్గరుండి పనులు చేయిస్తానని తెలియజేశారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు చేతి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి సిహెచ్ రేణుక శ్రీనివాస్ గౌడ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పేరుపేరునా మైనార్టీ సోదరి సోదరీమణులకు తెలియజేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ముఖ్యులు ప్రచార కాంగ్రెస్ పార్టీ నాయకులు యూసుఫ్, ఎనిమిదో వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చింటూ గౌడ్, ఆత్మ కమిటీ డైరెక్టర్ రాములు గౌడ్, న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్, రజక్ మరియు కాంగ్రెస్ పార్టీ మహిళామూర్తులు, యువ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *