తేది:06-02-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లాలోని ఐదు మునిసిపాలిటీ లకి సంబంధించి 2వ సాధారణ మునిసిపల్ ఎన్నికలు–2026 నేపథ్యంలో, తేదీ: 11.02.2026 న ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలియజేయడమైనది.
ఈ ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న ఐదు మున్సిపాలిటీల పరిధిలోని ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వినియోగించుకునే అవకాశం కల్పించబడినది.
అందుకు సంబంధించి తేదీ: 08.02.2026 ఆదివారం రోజున
ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు సంబంధిత 5 మున్సిపాలిటీల పరిధిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ నందు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవచ్చని తెలియజేయడమైనది. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే ఉద్యోగులు తప్పనిసరిగా
తమకు సంబంధించిన డ్యూటీ ఉత్తర్వుల ప్రతిని, గుర్తింపు కార్డు (ID కార్డు) తో పాటు హాజరుకావలసి ఉంటుందని తెలియజేయడమైనది. ఈ అవకాశాన్ని అర్హులైన ఉద్యోగులందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు