బుగ్గారం మండలం వెల్గొండ అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా అన్నప్రాసన కార్యక్రమం.

తేది:04-02-2026 TSLAWNEWS జగిత్యాల్ జిల్లా, బుగ్గారం మండల రిపోర్టర్ ఎల్.వెంకటేశ్వర్ రెడ్డి.

జగిత్యాల జిల్లా: బుగ్గారం మండలం వెల్గొండ గ్రామంలో అంగన్వాడీ ఫస్ట్‌ సెంటర్‌లో ఆరు నెలల పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమాన్ని అంగన్వాడీ టీచర్‌ చెట్‌పల్లి పద్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రుల సమక్షంలో చిన్నారులకు అన్నప్రాసన చేసి, 15 మంది పిల్లలకు బాలామృతాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ నీలం నందిని సంతోష్‌, ఉప సర్పంచ్‌ బండ్ర పెద్ద అంజయ్య పాల్గొని మాట్లాడారు. అంగన్వాడీల్లో అందించే పోషకాహారాన్ని గర్భిణులు, చిన్నారులు సద్వినియోగం చేసుకొని, ఆరోగ్యవంతంగా తయారు కావాలని సూచించారు. అంగన్వాడీలు సరఫరా చేస్తున్న పౌష్టికాహారాన్ని తల్లిదండ్రులు చిన్నారులకు అందించి, వారు ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూడాలని చెప్పారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్‌ చెట్‌పెల్లి పద్మ మాట్లాడుతూ.. బాలామృతం తినడం వల్ల పిల్లలు శారీరకంగా, మానసికంగా దృఢంగా మారుతారని చెప్పారు. ఇది వారి ఎదుగుదలకు ఎంతో తోడ్పడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎం జయసుధ, ఆశావర్కర్లు మంగ, నాగమని, శారద, అంగన్వాడీ టీచర్‌ కోరుకంటి రజిత పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *