మూడు నెలల విరామం తరువాత చంద్రబాబు ప్రజల మధ్యకు వచ్చారు. తుఫాను ప్రభావిత జిల్లాల్లో పర్యటించిన చంద్రబాబు రైతులకు భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్ పైన విమర్శలు చేసారు. జగన్ ప్రభుత్వం సాయం చేయకుంటే తాను అధికారంలోకి రాగానే అండగా నిలుస్తానని చెప్పుకొచ్చారు. ఇక..ఇదే సమయంలో ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ రాసారు.తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించి సాయం చేయాలని కోరారు. రాష్ట్రంలోని 15 జిల్లాలపై తుపాను తీవ్ర ప్రభావం చూపిందన్నారు.
ప్రజలను ఆదుకోండి : తుపాను వల్ల నష్టపోయిన ఏపీ ప్రజలను ఆదుకోవాలని ప్రధాని మోడీకి టిడిపి అధినేత చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్రంలోని 15 జిల్లాలపై తుపాను తీవ్ర ప్రభావం చూపిందన్నారు.మొత్తం 22 లక్షల ఎకరాల్లో పంటలు పూర్తిగా, పాక్షికంగా దెబ్బతిన్నాయన్నారు. రూ..10వేల కోట్ల మేర పంట నష్టం ఉంటుందని అంచనా వేశారని తెలిపారు. తుపాను నష్టం అంచనాకు కేంద్ర బృందాన్ని పంపాలని కోరుతూన కేంద్ర బృందం పర్యటనకు రాకముందే కొత్త మొత్తాన్ని పంపాలని మోడీకి రాసిన లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. తుఫాను రాష్ట్రంలోని 15 జిల్లాల్లో తుఫాను తీవ్ర ప్రభావం చూపిందని వివరించారు. 100 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు ప్రజల జీవనాన్ని దెబ్బతీశాయని లేఖలో వెల్లడించారు.
TDP Chief Chandrababu seeks immediate government help to flood victims in a letter to PM Modi
22 లక్షల ఎకరాల్లో నష్టం : తుఫాను కారణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 22 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని తెలుస్తోందన్నారు. తద్వారా రూ. 10 వేల కోట్ల వరకు పంట నష్టం ఉంటుందని అంచనాగా వివరించారు. పంటలు దెబ్బతినడంతో పాటు పలు చోట్ల పశువులు చనిపోయాయి, చెట్లు విరిగిపడ్డాయని పేర్కొన్నారు. దాదాపు 770 కి.మీల మేర రోడ్లు తీవ్రంగా దెబ్బ తిన్నాయని చెప్పారు. తాగునీరు, నీటిపారుదల, విద్యుత్, కమ్యూనికేషన్ రంగాలకు నష్టం జరిగిందని వివరించారు. వ్యవసాయంతో పాటు ఆక్వా రంగం కూడా నష్టపోయిందని చెప్పారు.తుఫాను వల్ల పంట నష్టపోయి ఆవేదనతో నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.. మత్స్యకార పడవలు, వలలకు కూడా నష్టం జరిగింది. వారు జీవనోపాధి కోల్పోయారని వివరించారు.
జీతీయ విపత్తుగా ప్రకటించండి : తుఫాను ప్రభావం ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాలేదు. పొరుగున ఉన్న తమిళనాడుపై కూడా ప్రభావం చూపిందని చంద్రబాబు పేర్కొన్నారు. తుఫాను తీవ్రత, నష్టం దృష్ట్యా మిచౌంగ్ తుఫానును ‘జాతీయ విపత్తు’గా ప్రకటించాలని కోరారు. తుఫాను నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం నుండి ఒక బృందాన్ని పంపాలని అభ్యర్దించారు. జాతీయ విపత్తుగా ప్రకటిస్తే తక్షణ, మెరుగైన సహాయం బాధితులకు అందుతుంది. మీ ప్రకటన ద్వారా తుఫాను బాధితులలో విశ్వాసాన్ని నింపే అవకాశం ఏర్పడుతుందని చంద్రబాబు లేఖ ద్వారా ప్రధానికి వివరించారు.