మెదక్ టౌన్ పోలీసుల వాహన తనిఖీలో పట్టుబడ్డ బైక్ దొంగ – నిందితుడు అరెస్ట్, 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం.

తేది:2-02-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.

మెదక్ జిల్లా : మెదక్, రామాయంపేట పరిసర ప్రాంతాల్లో వరుసగా జరుగుతున్న ద్విచక్ర వాహనాల దొంగతనాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో వాహనాల తనిఖీ కార్యక్రమం చేపట్టగా, అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు కమ్మరి రాములుగా గుర్తించబడినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడు గతంలో కూడా పలు ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడ్డాడని, మెదక్ టౌన్ మరియు రామాయంపేట పరిసరాల్లో నమోదైన అనేక కేసుల్లో ఇతడే ప్రధాన నిందితుడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అతడి వద్ద నుంచి 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను మెదక్ టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీ మహేష్ గారు మీడియాకు వెల్లడించారు. ప్రజలు తమ వాహనాలను సురక్షితంగా నిలిపేలా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *