తేది:2-2-2026 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ విజయ్ మురళీకృష్ణ.
హైదరాబాద్:రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్ పిల్లర్ నెంబర్140 వద్ద గాంజా విక్రయిస్తున్న గంజాయి కనుగోలు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను విశ్వసనీయ సమాచారం ప్రకారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గంజాయితో పట్టుబడ్డ వారు ఒరిస్సా కు చెందిన రమకాంత్ నాయక్, కేరళకు చెందిన ధీరజ్ గా పోలీసులు గుర్తించారు.
ధీరజ్ కూ పోలీసులు యూరిన్ డ్రగ్ కిట్టు ద్వారా టెస్టులు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది.
ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుండి 1 కేజీ గంజాయి, రెండు సెల్ఫోన్లను, యాక్టివా వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కేసు నమోదు చేసిన రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.