జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి మోడల్ స్కూల్లో ఖాళీ సీట్ల భర్తీకి ప్రవేశ ప్రకటన.

తేది:02-02-26 TSLAWNEWS జగిత్యాల్ జిల్లా, మల్యాల మండలం, రిపోర్టర్ కుందారపు రమేష్.

జగిత్యాల జిల్లా: మల్యాల మండలంలోని నూకపెల్లి ఆదర్శ పాఠశాలలో 2026- 27 విద్యా సంవత్సరానికి గాను ఖాళీ సీట్లను భర్తీ చేయడానికి ప్రవేశ ప్రకటన వెలువడినట్లు ప్రిన్సిపల్ ఆదిత్య తెలిపారు. 6వ తరగతిలో 100 సీట్లతోపాటు, 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా ఖాళీ సీట్లు ఉన్నాయని ప్రిన్సిపల్ పేర్కొన్నారు. కావున అర్హత, ఆసక్తి గల విద్యార్థులు ఫిబ్రవరి 28 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కాగా, ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 19న నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *