తేది:01-02-2026 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా, అందోలు నియోజకవర్గం కో-ఆర్డినేటర్ చాపల సత్యం.
సంగారెడ్డి జిల్లా: ప్రస్తుతం జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరడమే లక్ష్యంగా గులాబీ దండు సిద్ధమైందని అందోలు-జోగిపేట మున్సిపల్ 13వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి బరిలో నిలిచిన పట్లూరి శివశేఖర్ అన్నారు. శనివారం నామినేషన్ల పత్రాల పరిశీలన చేసిన అనంతరం ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పథకాలు అధికారంలోకి వచ్చక అవి అమలు ఎందుకు చేయలేకపోతున్నారని, అసలు ఆ పథకాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మహాలక్ష్మి కింద 2,500 పెన్షన్లు, కేసిఆర్ ఇచ్చే కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ లకు అదనంగా తులం బంగారం ఇస్తామని చెప్పిన హామీలు ఎందుకు అమలుకు నోచుకోలేకపోతున్నాయని ఆరోపిస్తూ ఇది ప్రజలను మోసం చేసే హామీలు కావా అని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మహిళలు ప్రసావిస్తే కేసీఆర్ కిట్టును బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందని ఇప్పుడు అది పేరు తెలియకుండా మాయమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కొనసాగే మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెసోళ్లను ఓటరు ప్రశ్నిస్తూ నిలదీయాలని సూచించారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ఆగం కాకుండా కారు గుర్తుపై ఓటు వేసి మళ్లీ బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.