తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారు. ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణస్వీకారం చేశారు. ముందుగా సీఎం రేవంత్ రెడ్డి చేశారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరు ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. శనివారం శాసన సభకు 109 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ఇక అన్ని పార్టీల తరఫున కలుపుకుని తొలిసారి అసెంబ్లీలో 51 మంది ఎమ్మెల్యేలు అడుగుపెట్టారు. ప్రమాణస్వీకారాల తరువాత స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ వేయనున్నారు. అటు బీజేపీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాలేదు. ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఎంపిక చేయడంపై వారు సమావేశాలను బాయ్ కాట్ చేశారు. రెగ్యులర్ స్పీకర్ ఎన్నిక తరువాతే భాజపా ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తామని తెలిపారు.
అటు మాజీ సీఎం కేసీఆర్ ఆపరేషన్ కారణంగా సభకు రాలేదు. కేటీఆర్ కూడా సభకు రాలేదు. ఇక హరీశ్ రావు ఎమ్మెల్యే ప్రమాణస్వీకారం చేశారు. ఈసారి కాంగ్రెస్ నుంచి 64 మంది, బీఆర్ఎస్ నుంచి 39 మంది, బీజేపీ నుంచి 8 మంది, ఎంఐఎం నుంచి ఏడుగురు, సీపీఐ నుంచి ఒకరు గెలిచారు. తాజాగా మంత్రులకు శాఖలు కేటాయించారు. రేవంత్ రెడ్డి వద్ద హోం శాఖ, మున్సిపాలిటీ, విద్య శాఖలు ఉంచుకున్నారు. మల్లు భట్టి విక్రమార్కకు ఆర్థిక శాఖ, విద్యుత్ శాఖ, దామోదర రాజనర్సింహకు వైద్య, ఆరోగ్యశాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఉత్తమ్‌కుమార్ రెడ్డికి సివిల్ సప్లై, నీటి పారుదల శాఖలు కేటాయించారు.
సీతక్కకు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్, ఉమెన్ వెల్ఫర్, శ్రీధర్‌బాబుకు ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాలు, కొండా సురేఖకు అటవీ శాఖ, దేవాదాయ, పర్యావరణ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సమాచార శాఖ, రెవెన్యూ, హౌసింగ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ, జూపల్లి కృష్ణారావుకు ఎక్సైజ్, పర్యాటక శాఖ, పురావస్తు శాఖ, తుమ్మల నాగేశ్వరరావుకు వ్యవసాయ శాఖ, చేనేత, అనుబంధ సంస్థలు, పొన్నం ప్రభాకర్ కు రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ కేటాయించారు.