మహిళలకే ఉచితం.. ఆర్టీసీ బస్సులో టికెట్ కొన్న తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి!!

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకమైన మహాలక్ష్మి పథకం అందుబాటులోకి వచ్చింది. ఈరోజు మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కీమ్ మహాలక్ష్మిని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ముందు మహిళా మంత్రులు కొండా సురేఖ, సీతక్క, శాంతి కుమారి, మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ తదితరులతో కలిసి జెండా ఊపి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించారు.

 

ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు పలువురు ఎమ్మెల్యేలు, రవాణా శాఖ సెక్రటరీ వాణి ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిన తర్వాత మహిళా మంత్రులు, మహిళా అధికారులు, జర్నలిస్టులు, మహిళా నేతలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్ వరకు బస్సులో ప్రయాణం చేశారు.

 

ట్యాంక్ బండ్ వద్దకు వెళ్లి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి తిరిగి వచ్చారు. అయితే మహిళా మంత్రులు, మహిళా అధికారులు, మహిళా నేతలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా బస్సులో ప్రయాణం చేసిన క్రమంలో ఆయన బస్సులో ప్రయాణిస్తున్న మహిళలందరికీ బస్సు ప్రయాణ టికెట్ ను అందించారు.

 

మహిళలందరికీ ఆర్టీసీ బస్సులలో ప్రయాణం ఉచితం కావడంతో మంత్రులు సీతక్క, కొండా సురేఖ టికెట్ తీసుకోలేదు. ఇక పురుషులకు టికెట్ ఉండడంతో సీఎం రేవంత్ రెడ్డి మాత్రం డబ్బులు చెల్లించి టికెట్ తీసుకున్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి టికెట్ తీసుకున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మహిళలకు మాత్రమే కావడంతో, తను టికెట్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది.

 

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. పేలుతున్న మీమ్స్; టీఎస్ఆర్టీసీకి పురుషుల విజ్ఞప్తులు!!

అయితే సీఎం హోదాలో ఉన్నప్పటికీ, మహాలక్ష్మి పథకాన్ని అందిస్తున్న క్రమంలో ప్రయాణం చేసినప్పటికీ రేవంత్ రెడ్డి టికెట్ తీసుకోవడం ఆసక్తికర చర్చకు కారణంగా మారింది. సీఎం హోదాలో ఉన్నప్పటికీ సామాన్యమైన వ్యక్తిగా రేవంత్ రెడ్డి టికెట్ తీసుకున్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *