పస్ర–తాడ్వాయి మార్గంలో ఐదు గంటల ట్రాఫిక్ జామ్‌. వీఐపీ వాహనాల అడ్డదారులు.

తేది:31-01-2026 TSLAWNWES వరంగల్ జిల్లా ఇంచార్జ్ వల్లే ప్రశాంత్.

వరంగల్ జిల్లా: ఆర్టీసీ బస్సులు, సిబ్బందిపై బెదిరింపులు.
జాతర చివరి రోజున అవస్థలు.తాడ్వాయి/మేడారం.
మేడారం జాతర ముఖ్యమైన రోజు శుక్రవారం రాత్రి 6 గంటల నుంచి శనివారం ఉదయం 12.30గంటలకు పస్ర నుంచి తాడ్వాయి వరకు భారీ ట్రాఫిక్ జామ్‌ నెలకొంది.
ఇన్ని ఏండ్ల జాతర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా డబుల్ రోడ్డుపై కూడా వాహనాలు కదలని పరిస్థితి ఏర్పడింది.
శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి.. ఐదు గంటలకు పైగా.. శనివారం ఉదయం 12.45 వరకు వాహనాలు నిలిచిపోవడంతో భక్తులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
వీఐపీ వాహనాల పేరుతో కొందరు నాయకులు రోడ్డుపై ఓవర్‌టేక్ చేస్తూ, అక్కడే విధులు నిర్వహిస్తున్న కొందరు పోలీస్ సిబ్బందిని బెదిరిస్తున్న ఘటనలు చోటుచేసుకున్నాయి.
ముఖ్యంగా ఫార్చ్యూనర్ వంటి ఖరీదైన వాహనాల్లో మద్యం సేవించి ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ, ఆర్టీసీ బస్సులకు తీవ్ర అంతరాయం కలిగించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అమ్మవారి రాక సందర్భంగా పదుల సంఖ్యలో యంగ్ ఐపీస్ అధికారులు కనిపించిన సంగతి తెలిసిందే.
ట్రాఫిక్ నియంత్రణకు “యంగ్ ఐపీఎస్” అధికారులను ఎక్కడ నియమించారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.కీలక సమయంలో వారు ఎక్కడా కనిపించలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
“ఓన్లీ ఫైరింగ్ చేస్తూ హూ.. హొ.. అంటూ ఆనందం వ్యక్తం చేయడమే తప్ప, ప్రజల ఇబ్బందులు పట్టించుకునే స్థాయిలో పర్యవేక్షణ లేద”ని భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అనుభవం లేని పోలీస్ అధికారుల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని,
సరైన సీనియర్ అధికారులు, పోలీసు సిబ్బంది ఉంటే, ట్రాఫిక్ సమస్యను కట్టడి చేయగలిగేవారని సామాన్య ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
రాత్రి పూట విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ల మాట వినకుండా నాయకుల అనుచరులు దూసుకెళ్లడం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసింది.
ఒక బాధ్యతాయుత అధికారి ఇక్కడే ఉంటే బాగుండేది” అన్న మాటలు వినిపించాయి.
మరోవైపు, కేవలం 600 రూపాయల కూలీ కోసం పారిశుధ్య కార్మికులు తమకు కేటాయించిన పనిని నిబద్ధతతో నిర్వహిస్తుండగా.,ట్రాఫిక్ పరిస్థితిని సమర్థంగా నియంత్రించాల్సిన అధికారులు మాత్రం విఫలమయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.యంగ్ ఆఫీసర్లకు స్థానిక పరిస్థితులపై ఎవరు మార్గనిర్దేశం చేయాలన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.మొత్తానికి జాతర చివరి రోజున ట్రాఫిక్ అవ్యవస్థ, వీఐపీ ఆర్భాటం, పోలీసు పర్యవేక్షణ లోపం కలిసి భక్తుల సహనాన్ని పరీక్షించాయని స్థానికులు వాపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *