తేది:30-01-2026 వికారాబాద్ జిల్లా TSLAWNEWS వికారాబాద్ నియోజకవర్గం రిపోర్టర్ గొల్ల లక్ష్మీనారాయణ.
వికారాబాద్ జిల్లా: ప్రతి గృహంలో కులదైవం ఫోటో పూజా గదిలో ఉంచాలి,రజకుల కులదైవం శ్రీశ్రీశ్రీ మడెలేశ్వర స్వామి జయంతి కార్యక్రమం మొట్టమొదటి సారిగా కోడంగల్ పట్టణ కేంద్రంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక అన్నారు. వికారాబాద్ జిల్లా కోడంగల్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో 30-1-2026 శుక్రవారం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్, జిల్లాఅధ్యక్షురాలు పర్సాపూర్ లక్ష్మీ అధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ మడెలేశ్వర స్వామి జయంతి సందర్భంగా స్వామి చిత్రపటానికి పూలమాల వేసి పూజలు చేసిన తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక , అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు అన్నారం సాయిలు, జిల్లా ఉపాధ్యక్షులు వెంకటయ్య , పర్సపూర్ లలిత బషీరాబాద్ మండల అధ్యక్షులు మోహన్,గొటికె నాగేష్
ఈసందర్భంగా జిల్లా అధ్యక్షురాలు పర్సాపూర్ లక్ష్మీమాట్లాడుతూ స్వామి జయంతి రోజున ఊరూరా అంగరంగ వైభవంగా జయంతి ఉత్సవాలు జరుపుకోవాలని , మడేల్ మాచయ్య జీవిత చరిత్ర ప్రతిఒక్కరూ తెలుసుకోవాలని కోరారు. కులదైవం ఫోటోను కులస్తుల ఇంట్లో పూజగదిలో ఉంచి పూజలు చేయాలని జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్ రజక కుల బంధువులను కోరారు.