తేది:30-01-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.
మెదక్ జిల్లా: ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా సాగేందుకు పోలీసు శాఖ అన్ని చర్యలు తీసుకుంది. కోర్టు ప్రాంగణం చుట్టుపక్కల పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు,ప్రవేశ ద్వారాల వద్ద తనిఖీలు నిర్వహించి, వాహనాల రాకపోకలను నియంత్రించారు.
అదనపు ఎస్పీ గారు విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ, న్యాయవాదులు, ఓటర్లు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తక్షణ చర్యలకు సిద్ధంగా ఉండాలని తెలిపారు.
జిల్లా పోలీసు యంత్రాంగం సమన్వయంతో చేపట్టిన ఈ భద్రతా చర్యలతో తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా సాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.