తేది:30- 01- 2026 TSLAWNEWS జగిత్యాలజిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ IAS ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా కలెక్టరేట్ సమావేశంలో శుక్రవారం రోజున జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్. లత జిల్లాలోని ఆధార్ సెంటర్ ఆపరేటర్స్ సమావేశం నిర్వహించడం జరిగింది.
UIDAI నిర్దేశించిన రుసుములను మాత్రమే తీసుకోవాలని, ఎవరైనా అధిక రుసుము తీసుకున్నచో కఠిన చర్యలు తీసుకోబడునని సూచించడం జరిగింది. ఆధార్ ప్రైజ్ చార్ట్స్ & సైన్ బోర్డ్స్ ఉండాలని, ఆధార్ నమోదు మరియు సవరణలు చేసే సమయంలో నిర్దేశించిన డాక్యుమెంట్లను మాత్రమే అప్లోడ్ చేయాలని సూచించడం జరిగింది
UIDAI ఆఫీస్ నిర్వహించే NCEAR సర్వే లో అందరూ పాల్గొని ఫిబ్రవరి 5 వరకు పూర్తి చేయాలని ఆదేశించారు.
ఇట్టి సమావేశంలో జగిత్యాల జిల్లా EDM మమత, TGTS డిఎం చేతన్ మరియు జిల్లాలోని ఆధార్ సెంటర్ ఆపరేటర్లు పాల్గొనడం జరిగింది.