తేది30-01-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లా: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో, జగిత్యాల, కోరుట్ల,మెట్ పల్లి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి ఐపిఎస్ గారు క్షేత్రస్థాయిలో సందర్శించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. విధుల్లో ఉన్న పోలీసు అధికారులు మరియు సిబ్బందికి భద్రతాపరమైన సూచనలు చేశారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ, నామినేషన్ కేంద్రాల పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని అభ్యర్థులు మరియు వారి అనుచరులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (MCC) కచ్చితంగా పాటించాలని, నిబంధనలకు విరుద్ధంగా, శాంతిభద్రతల విఘాతానికి ప్రయత్నించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.
అదనపు ఎస్పీ వెంట డిఎస్పి రాములు, ఇన్స్పెక్టర్లు కరుణాకర్, అనిల్ కుమార్,మరియు ఎస్.ఐలు ఉన్నారు.