డబ్బా గ్రామంలో హైమాస్ట్ లైట్ల ప్రారంభోత్సవం.

తేది:29-01-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం మండల రిపోర్టర్ రాడే శ్రీనివాస్.

జగిత్యాల జిల్లా: ఇబ్రహీంపట్నం,మండలంలోని డబ్బా గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన హైమాస్ట్ విద్యుత్ దీపాలను గ్రామ సర్పంచ్ పుప్పాల లక్ష్మి మహేష్ ప్రారంభించారు. గ్రామంలోని ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రాలైన ఎల్లమ్మ గుడి మరియు మల్లన్న స్వామి గుడి ఆవరణలో ఈ లైట్లను ఏర్పాటు చేశారు.
ఆలయాల వద్ద చీకటి సమస్యను తొలగించి, భక్తులకు మరియు స్థానిక ప్రజలకు మెరుగైన వెలుతురు అందించాలనే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పుప్పాల నర్సయ్య ఉప సర్పంచ్ రాపెళ్లి మహేష్ వార్డ్ మెంబర్లు గౌడ సంఘం సభ్యులు మరియు గ్రామస్తులు. పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *