అల్లీపూర్ లో గొడ్డలి వేటకు బలి అవుతున్న అటవీ సంపద.

తేది:29-01-2026 TSLAWNEWS రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామం రిపోర్టర్ అనుమల్ల రాజ్ కుమార్.

జగిత్యాల జిల్లా : రాయికల్ మండలం రాయికల్ మండలం అల్లీపూర్ పరిధిలో సుమారు 311 హెక్టార్ల అడవి భూమి ఉంది. ప్రకృతి రమణీయమైన అటవీ సంపద సౌందర్యం దట్టమైన అడవులు, ఎత్తయిన కొండలు, అందమైన టేకు వనం వివిధ చెట్లతో, చిన్నపాటి వాగులతో కూడిన ప్రశాంతమైన ప్రాంతాన్ని కనుమరుగయ్యే విధంగా అల్లీపూర్ ఫారెస్ట్ కనబడుతుంది. రాత్రి వేళల్లో యదేచ్చగా దుండగులు టేకు చెట్లను నరకడం మొదలు పెడుతున్నారు. రాత్రి వేళల్లో ఎడ్ల బండ్ల పైన, బైకుల పైన టేకు కట్టెలను తీసుకువెళ్తున్నారు అని గ్రామస్తులు చెబుతున్నారు. ఫారెస్ట్ అధికారులు అటవీ సంపదను కాపాడాలని గ్రామప్రజలు కోరుకుంటున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఊరికి ఒక ఫారెస్ట్ చైర్మన్ ఉండేవారు. వారు ఆ గ్రామ పరిధిలో ఉండి ఫారెస్ట్ లో జరిగే అక్రమాలను తెలుసుకొని,చూసి సంబంధిత అధికారులకు తెలియజేసేవారు. ఇదే విధమైన దుండగులు ఫారెస్ట్ అధికారుల పైన దాడి చేయడం బెదిరించడం జరుగుతుంది. ఇకనైనా అధికారులు దుండగులపైన ప్రత్యేక దృష్టి సాధించి అడవిని రక్షించాల్సిందిగా ప్రజలు కోరుకుంటున్నారు. నేటి తరానికి అడవి ఆనావాళ్లు లేకుండా పోతున్నాయి అని చెప్పి వాపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *