తేది:29- 01-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లా: సమాచార పౌరసంబంధాల శాఖ నుంచి అధికారికంగా అక్రిడేషన్ కార్డులు పొందిన జర్నలిస్టులు మాత్రమే తమ వాహనాలపై ‘ప్రెస్’ అని రాసుకోవాలని లేదా స్టిక్కర్లు వేసుకోవడాలని డీపీఆర్వో పల్లికొండ నరేష్ తెలిపారు. అక్రిడేషన్ లేని వ్యక్తులు వాహనాల పై ‘ప్రెస్’ అని రాసుకోవడం మోటారు వాహన చట్టానికి విరుద్ధమన్నారు. ఈ మేరకు రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ ప్రియాంక ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వాహనాలపై అనధికారికంగా ‘ప్రెస్’ స్టిక్కర్లు వేసుకున్నవారిని గుర్తించేందుకు తనిఖీలు చేస్తామని తెలిపారు.