గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కబోయే సినిమాపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్, ప్రశాంత్ నీల్ సినిమా ప్రజెంటేషన్ పై ఆమాత్రం ఆసక్తి ఉండక తప్పదు మరి. తాజాగా ప్రశాంత్ నీల్ ఈ సినిమా కథ నేపథ్యం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకూ తాను తీసిన చిత్రాలన్నింటిలో ఎన్టీఆర్ 31 విభిన్నంగా ఉంటుందన్నారు. ఈ సినిమా జానర్ ఏదైనా అభిమానులకు కనెక్ట్ అవుతుందన్నారు.