డాన్ గా బాలయ్య..? ఇక ఫ్యాన్స్ కు పునకాలే..!

నందమూరి బాలకృష్ణ ఈ ఏడాది బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించిన అఖండ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ అంటేనే సూపర్ హిట్ కాంబినేషన్ అలాంటిది వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా అఖండ సినిమాకు సీక్వెల్ కావడంతో ఈ సినిమా పట్ల భారీగా అంచనాలు ఉండేవి. కానీ ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల అంచనాలను మాత్రం చేరుకోలేకపోయింది. ఇక ఈ సినిమా అనంతరం బాలకృష్ణ తన తదుపరి చిత్రం పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారని తెలుస్తోంది.

 

మారిపోయిన బాలయ్య NBK 111 కథ..

బాలకృష్ణ తన తదుపరి సినిమాని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బాలయ్య కెరియర్ లో NBK 111 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను ప్రారంభించబోతున్నారు. నిజానికి ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభం కావాల్సి ఉండగా స్క్రిప్ట్ విషయంలో కొన్ని మార్పులు చేయాల్సి రావడంతో కాస్త ఆలస్యం అయ్యిందనే చెప్పాలి. ఇదివరకు రాసిన స్క్రిప్ట్ పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా రాబోతున్నట్టు ప్రకటించారు. ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో మహారాజు పాత్రలో కనిపించబోతున్నట్లు ఒక పోస్టర్ ద్వారా వెల్లడించారు. అయితే ఈ స్క్రిప్ట్ ప్రస్తుతం మార్చేసారని తెలుస్తోంది.

 

ముంబై డాన్ గా బాలయ్య..

గోపీచంద్ బాలకృష్ణ కోసం మరో యాక్షన్ కథను సిద్ధం చేశారని సమాచారం. ఈ సినిమా గ్యాంగ్స్టర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయని దర్శకుడు గోపీచంద్ మలినేని స్వయంగా వెల్లడించారు. ఈ సినిమాలో బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక రైతుగా కనిపించబోతున్నారని తెలుస్తోంది..రైతుగా ఉన్న ఈయన ముంబై డాన్ గా ఎలా మారారు అనే నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. ఇక ముంబై డాన్ గా బాలకృష్ణ కనిపించబోతున్నారనే విషయం తెలియడంతో ఇందులో యాక్షన్స్ సన్ని వేషాలు కూడా అదే రేంజ్ లో ఉండబోతున్నాయని స్పష్టమవుతుంది.

 

కథ మారిన హీరోయిన్ మారలే..

 

ఏది ఏమైనా కొత్త కథతో బాలకృష్ణ విశ్వరూపం చూడబోతున్నామని చెప్పాలి. ఇక హీరోయిన్ విషయంలో కూడా ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేశాయి. ఈ సినిమా కథ పూర్తిగా మార్చడంతో నయనతార కూడా సినిమా నుంచి తప్పుకున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం.. కథ మారినప్పటికీ హీరోయిన్ మాత్రం మారలేదని ఈ సినిమాలో నయనతార(Nayanthara) యధావిధిగా నటించబోతున్నారని తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి ఒక కీలక అప్డేట్ రాబోతుందని దర్శకుడు గోపీచంద్ మలినేని తెలియచేశారు. ఇక వీరిద్దరి కాంబినేషన్లో ఇదివరకు వీర సింహారెడ్డి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో బాలయ్య మరోసారి గోపీచంద్ కు అవకాశం కల్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *