డైరెక్టర్ మారుతి పై ప్రభాస్ ఫ్యాన్స్ రివెంజ్..! ఏకంగా 100 ఆర్డర్లు..!

డైరెక్టర్ మారుతి ప్రస్తుతం ప్రభాస్(Prabhas )అభిమానుల ట్రోలింగ్ కు గురి అవుతున్నారు. దర్శకుడుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ పలువురు హీరోలతో సినిమాలు చేస్తున్న మారుతి ఏకంగా ప్రభాస్ తో సినిమా చేసే అవకాశాన్ని అందుకున్నారు. పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్న ప్రభాస్ మారుతికి సినిమా అవకాశాన్ని కల్పించడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్య వ్యక్తం చేశారు. అయితే ప్రభాస్ ఇచ్చిన ఈ అవకాశాన్ని మారుతి సరైన విధంగా ఉపయోగించుకోలేదని తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ లో ది రాజా సాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా పూర్తిగా ప్రేక్షకులను నిరాశ పరచడంతో ప్రభాస్ అభిమానులు మారుతి పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.

 

ఇంటి అడ్రస్ చెప్పిన మారుతి..

ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి డైరెక్టర్ ను సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఆయన ఇంటికి వరుస ఫుడ్ఆర్డర్లు చేస్తూ ఎంతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా మారుతి మాట్లాడుతూ తన ఇంటి అడ్రస్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాలేకపోతే మా ఇంటికి వచ్చి నన్ను ప్రశ్నించండి అంటూ ఈయన కొండాపూర్ కొల్లా లగ్జరీ విల్లాలో నివసిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ సినిమా డిజాస్టర్ గా నిలవడంతో ప్రభాస్ అభిమానులు మారుతి పై రీవెంజ్ తీర్చుకుంటున్నారు.

 

స్విగ్గి, జొమాటో నుంచి వరుస ఆర్డర్లు..

ఒకవైపు సోషల్ మీడియాలో మారుతి పై నెగిటివ్ పోస్టులు చేస్తూనే మరోవైపు తన ఇంటికి స్విగ్గి, జొమాటో నుంచి వివిధ రకాల ఫుడ్ ఆర్డర్ పెడుతున్నారు. అయితే ఇవన్నీ కూడా క్యాష్ ఆన్ డెలివరీ కావడం గమనార్హం. ఇలా ఇప్పటివరకు వందకు పైగా ఆర్డర్లు వచ్చాయని తెలుస్తోంది. స్విగ్గి జొమాటో నుంచి వరుసగా ఆర్డర్లు రావడంతో మారుతి సిబ్బంది ఆయనకు ఈ విషయాన్ని తెలియచేయడంతో తాను ఎలాంటి ఆర్డర్ పెట్టలేదని చెప్పారట. దీంతో వచ్చిన వాటిని తిరిగి వెనక్కి పంపించడం కోసం మారుతి సిబ్బంది నానా తంటాలు పడుతున్నారని తెలుస్తుంది.

 

సైబర్ క్రైమ్ ను ఆశ్రయించిన నిర్మాత..

 

ఇలా తమ అభిమాన హీరోతో డిజాస్టర్ సినిమా చేసిన నేపథ్యంలోనే ప్రభాస్ అభిమానులు ఓ రేంజ్ లో మారుతి పై విమర్శలు చేయడమే కాకుండా తనకు ఈ విధంగా చుక్కలు చూపిస్తున్నారు. ఇక ఈ సినిమాకు లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన మరొక నిర్మాత ఎస్ కే ఎన్ పై కూడా ఇలాంటి విమర్శలు చేసిన నేపథ్యంలో ఆయన ఏకంగా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇక మారుతి మాత్రం ఈ విషయంలో ఏ విధంగానూ రియాక్ట్ అవ్వకుండా మౌనం పాటిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *