తేది:28-01-2026 సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల TSLAWNEWS రిపోర్టర్ ఫయ్యాజ్ షరీఫ్.
సంగారెడ్డి జిల్లా: నూతన రజక ప్రజా ప్రతినిధుల ఆత్మీయ సమ్మేళన సన్మాన సభ మరియు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ :ముఖ్య అతిథిగా ఝరసంగం మండల తహశీల్దార్ సి భాస్కర్ హాజరయ్యారు. ఝరసంగం మండల కేంద్రంలో మండల రజక సంఘం ఆధ్వర్యంలో సన్మాన సభ కార్యక్రమంలో పాల్గొని నూతన సంవత్సర కేతకీ రజక సంఘం క్యాలెండర్ ను ఆవిష్కరించారు,అనంతరం ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు,నూతనంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలియజేశారు.మహిళలు రాజకీయంగా ముందుకు ఎదగాలి అని కోరారు.అనంతరం కేతకీ రజక సంఘం తరపున ముఖ్య అతిథిగా విచ్చేసిన తహశీల్దార్ గారిని మండల రజక సభ్యుల ఆధ్వర్యంలో సన్మానం చేయడం జరిగింది.అలాగే నూతనంగా ఎన్నికైన సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ ,వార్డ్ మెంబర్ లను సన్మానించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో రజక సంఘం మండల అధ్యక్షుడు లక్ష్మణ్ నూతన బిడెకన్న సర్పంచ్ రవీందర్, బార్దీపూర్ ఉప సర్పంచ్ తుకారాం మరియు చిల్కేపల్లి , చిలేపల్లి, ఎల్గోయ్ వివిధ గ్రామాల్లో ఎన్నికైన ప్రజా ప్రతినిధులు మరియు మండల నాయకులు దత్తు,రాజ్ కుమార్,నాగన్న, సంగమేష్, శ్రీశైలం,హనుమంతు, నర్సింలు ,యాదుల్, బస్వరాజ్, శివకుమార్, ఎల్గోయ్ రాజు కుమార్ ,జనార్దన్ ,మరియు వివిధ గ్రామాల రజకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు