తేది:28- 01- 2026 మెదక్ జిల్లా TSLAWNEWS అల్లాదుర్గం మండల్ రిపోర్టర్ వి పాపయ్య చారి.
మెదక్ జిల్లా: అల్లాదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ సారిక విధులకు ఇస్తానుసారంగా హాజరవుతున్నారని పలు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.
నిత్యం ఉదయం తొమ్మిది గంటలకు విధులకు హాజరు కావలసి ఉండగా ఆసుపత్రిలో డాక్టర్ విధులకు సరిగా హాజరు కాకుండా ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు వెళ్తున్నారో తెలియడం లేదని ఆసుపత్రికి వచ్చే పలు గ్రామాల ప్రజలు, రోగులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి ఉందన్నమాట కానీ డాక్టర్ రోగులకు సరిగా అందుబాటులో ఉండడం లేదని ఆరోపణలు సర్వత్ర వినిపిస్తున్నాయి. మండల పరిధిలోని ముప్పారం, చిల్వర్ సబ్ సెంటర్లలో విధులు నిర్వహిస్తున్న ( ఎం ఎల్ హెచ్ పి ఓ) లు సంధ్య, నిర్మల వైద్యాధికారులు ఆయా గ్రామాలలో విధులు నిర్వహించవలసి ఉండగా, అల్లాదుర్గం ప్రభుత్వ వైద్యాధికారి సారిక ఈ కింది స్థాయికి వైద్య సిబ్బందిని మండల ఆరోగ్య కేంద్రం నికి రప్పించి విధులు నిర్వహించాల ఒత్తిడి చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. వీరిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహించేలా చేస్తూ తాను మాత్రం విధులకు గైరాజరవుతూ రోగులకు సక్రమంగా వైద్య సేవలు అందించడం లేదని ఆయా గ్రామాల ప్రజలు, ఆసుపత్రికి వచ్చే రోగులు విమర్శిస్తున్నారు. ఆస్పత్రిలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో విధులకు సరిగా రాకున్నా ఎవరేమి చేస్తారనే ధోరణితో వ్యవహరిస్తున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సంకల్పంతో పనిచేస్తున్న, తన సొంత ఇలాకలో డాక్టర్ ఇలా ఇష్టంసారంగా వ్యవహరిస్తూ సక్రమంగా విధులకు హాజరు కావడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు ఇప్పటికైనా జిల్లా సంబంధించిత ఉన్నత అధికారులు స్పందించి డాక్టర్ సక్రమంగా విధులకు హాజరయ్యాలా చూడాలని, రోగులకు అందుబాటులో ఉండేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.