ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం చరిత్రాత్మక నిర్ణయమని టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. “మహాలక్ష్మి పథకం వల్ల ప్రజారవాణా పుంజుకుంటుంది. పథకం అమలుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు అసెంబ్లీ ప్రాంగణంలో పథకాన్ని సీఎం ప్రారంభిస్తారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు జీరో టికెట్ ఇస్తారు.” అని సజ్జనార్ పేర్కొన్నారు