తేది:27- 01- 2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లా: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని అని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపిఎస్ తెలిపారు. ఎన్నికలు నిర్వహించే జగిత్యాల , రాయికల్, ధర్మపురి, కోరుట్ల, మెట్ పల్లి మున్సిపాలిటీలకు రేపటి నుండి నామినేషన్ ప్రక్రియ ప్రారంభ కావడం జరుగుతుందని, నామినేషన్ ప్రక్రియకు అనుగుణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత ఏర్పాట్లును చేయడం జరిగిందని అన్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిది నిబంధన ఉంటుందని, నామినేషన్ సెంటర్ వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని అన్నారు. నామినేషన్ల దాఖలు సందర్భంలో అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తన నియమావళి (Model Code of Conduct) ను కచ్చితంగా పాటించాల్సి ఉంటుందని అన్నారు.
అభ్యర్థుల కు పోలీసుల సూచనలు:
1. అభ్యర్థులు అనుమతి పొందిన వాహనాలను మాత్రమే వినియోగించాలి.
2. ఊరేగింపు కార్యక్రమాలు ఎన్నికల నిబంధనలకు లోబడి నిర్వహించాలి.
3. కుల, మత, ప్రాంత, వర్గ విభేదాలు రెచ్చగొట్టే విధంగా ఎవరూ మాట్లాడరాదు.
4. వాహనాలకు లౌడ్ స్పీకర్లు వినియోగించాలంటే సంబంధిత అధికారుల నుండి అనుమతి తప్పనిసరిగా పొందాలి.
5. వాహనాలపై రిటర్నింగ్ అధికారి జారీ చేసిన పర్మిట్ ఒరిజినల్ కాపీతో పాటు వాహనం నంబర్, అభ్యర్థి పేరు ప్రదర్శించాలి.
6. నామినేషన్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు తీసుకెళ్లడానికి అనుమతి లేదు.
7. నామినేషన్ సమర్పించడానికి ఊరేగింపుతో వచ్చే అభ్యర్థి తన అనుచరులు, మద్దతుదారులు మొదలైన వారు రిటర్నింగ్ అధికారి కార్యాలయనికి 100 మీటర్ల పరిధి వరకు మాత్రమే అనుమతించబడును.
8. రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి ప్రవేశం ఎన్నికల నిబంధనల ప్రకారం అభ్యర్థి మరియు మరో ఇద్దరికి మాత్రమే అనుమతించబడుతుంది.